తెనాలి రామకృష్ణుడు బాల్యంలోనే తండ్రి చనిపోయాడు. తల్లి వైపునుంచి బంధువులు ఎవరు లేరు తను తల్లి ఒక చిన్న పల్లెటూరి లో ఉండేవారు.  ఆ స్థితిలో వాళ్ళని రామకృష్ణుని మావయ్య తెనాలి తీసుకు వెళ్లి వాళ్ళ మంచి జడలు చూశాడు. తల్లి రామకృష్ణుడు మిక్కిలి గారాబంగా పెంచింది అతని పాఠశాలకు కుండ పంపలెేదు. రామ కృష్ణుడు మామయ్య కూడా అతని మీద అమితమైన ప్రేమ చూపిస్తూ ఉండేవాడు రామకృష్ణ సోమరిపోతు గా తయారయ్యాడు.

                                                      అతి గారాబంగా పెరిగిన రామకృష్ణ సమయమంతా ఆటపాటలతోను, చెడుసావాసాలు తోను గడుపుతూ ఉండేవాడు.  మామయ్య రామకృష్ణుని బడికి పంపే ప్రయత్నం చేశాడు. కానీ రామ్ కృష్ణ బడికి సరిగ్గా వెళ్లేవాడు కాదు. కొడుకుని సరిగ్గా పెంచలేక పోతున్నాను అని తల్లి తనని తాను తిట్టుకునేది. తన కన్నా కొడుకుని బాగు చేయమని దేవుని ప్రార్థించేది.

వికటకవి

                                                 ఒకరోజు దారిన పోయే ఒక సాధువు రామకృష్ణుని చూసి జాలిపడి కాళీ మాతా మంత్రోపదేశం చేశాడు.  సాధువు చెప్పినట్టుగా రామకృష్ణ రాత్రిపూట కాళీ మాతా మందిర్ లోకి వెళ్లి విగ్రహం ముందు కూర్చొని సాధువు చెప్పిన కాళీ మాత మంత్రోపదేశం చేశాడు. రామకృష్ణుని భక్తులకు కాళీమాత ప్రత్యక్షమయింది. రామకృష్ణుని ఆశ్చర్యానికి అంతులేదు. అయితే రామకృష్ణుడు కాళీమాత స్వరూపాని చూసి ఏ మాత్రం భయపడకపోగా ఆమెను చూసి పగలబడి నవ్వాడు.
                                                      ఆ నవ్వుకు కాళీ మాతకు కోపం వచ్చింది.  ఆ కోపంతో “నన్ను చూసి భయపడిన వారు ఈ ప్రపంచంలో ఇంతవరకు లేదు. నువ్వు భయపడకపోగా నవ్వుతున్నావ్! కారణం ఏమిటి” అని అడిగింది. అందుకు రామకృష్ణుడు చేతులు జోడించి, “తల్లి! నన్ను క్షమించు. నేను అమాయకుడిని మిమ్మల్ని హఠాత్తుగా చూడటం వల్ల నాకు ఒక అనుమానం వచ్చింది. ఆ అనుమానం వల్ల నేను నవ్వు ఆపుకోలేక పోయాను” అని విన్నవించుకున్నాడు

                                                       “ఏమిటి నీ అనుమానం” అని ప్రశ్నించింది కాళీమాత. అప్పుడు రామకృష్ణ “తల్లి! మానవులమైన మేము జలుబు చేసినప్పుడు విపరీతంగా బాధ పడుతూ రెండు చేతులు ఉండటం వల్ల ఏ చేత్తో తుడుచుకోవాలి అర్థం కాక ఇబ్బంది పడతాం. మరి ఇన్ని చేతులున్న మీరు జలుబు చేసినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడతారు కదా! అని నవ్వొచ్చింది తల్లి”, అని అన్నాడు. ఆ మాటలకు కాళీ మాత కూడా నవ్వకుండా ఉండలేకపోయింది.

                                                        ఏమైనప్పటికీ కాళీ మాత రామకృష్ణునికి ఏదో ఒక వరం ఇవ్వాలి అని నిశ్చయించుకుంది. రెండు గిన్నెలు తన మహిమతో సృష్టించి,” నా చేతుల్లో రెండు గిన్నెలు వున్నాయి. ఒకదాంట్లో పాలు, మరొక దాంట్లో పెరుగు ఉంది. నీకు కావాల్సింది అడుగు. పెరుగు తీసుకుంటే నీకు మంచి చదువు వస్తుంది. పాలు తీసుకున్నట్లయితే నీకు అమితమైన ధనం వస్తుంది. ఏమి కావాలో నిర్ణయించుకో” అని అడిగింది.

                                                       దానికి రామకృష్ణుడు “తల్లి, నేను వెంటనే సమాధానం చెప్పలేను, నాకు రెండు గిన్నెలు ఇవ్వండి. నేను రుచి చూసి ఏది ఎక్కువ రుచిగా ఉంటే అది తీసుకుంటాను.” అని చెప్పాడు.

                                                        అతడు అడిగినట్టుగా అనే రెండు పాత్రలు రామకృష్ణుడికి ఇచ్చింది కాళీమాత. వాటిని రామకృష్ణ చేతిలోకి తీసుకుని రెండిటిని తాగేశాడు. ఆ తర్వాత శిరసు వంచి, తనని “తల్లి! ఈ రెండు గిన్నెల్లో పదార్థాలు రెండు రుచిగా, తీయగా ఉన్నాయి. అందువల్ల నేను రెండింటినీ తాగాను. దయచేసి నన్ను నేను ఆగ్రహానికి గురి చేయవద్దు. ఈ ప్రపంచంలో మనిషిని అందరికీ విద్య, ధనం రెండూ అవసరమే. ధనం లేకపోయినట్లయితే విద్య లేదు, విద్య లేకపోతే గౌరవం లేదు. కేవలం డబ్బుతో ఎవరు ఆనందంగా ఉండలేరు. అందువల్ల నాకు రెండు అవసరమే. అందుకనే రెండింటినీ తాగాను. దయచేసి నన్ను క్షమించు తల్లీ”, అని ప్రార్ధించాడు.

                                                     రామకృష్ణ మాటలకు కాళీమాతకు కోపం వచ్చినప్పటికీ, అతనిపై దయ చూపించింది. అతనిని కొద్దిగా శిక్షించాలని తలచి ‘నువు “వికటకవి” అవుతావని శపించింది’. ఆ శాపానికి రామకృష్ణ భయపడిపోయాడు. వెంటనే కాళీమాత కాళ్లపై పడి తనను క్షమించమని ప్రాధేయపడ్డాడు. కాళీమాత,” రామకృష్ణ! వికటకవి అయినప్పటికీ పేరు సంపాదిస్తారు. ప్రజలతో పాటు రాజును కూడా నిన్ను ఆరాధిస్తారు. అందువల్ల నా శాపానికి చింతించవలసిన పనిలేదు” అని చెప్పింది. ఆ తర్వాత కాళీమాత అదృశ్యమయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here