ఒకరోజు ఒక ప్రసిద్ధ కవి పుంగవుడు రాయల ఆస్థానానికి విచ్చేశాడు. అతడు మహారాజుతో ఇలా అన్నాడ. “మహారాజా! నన్నయ్యవేమా అనే రాజు గురించి నేను ఒక పెద్ద కావ్యం రాశాను. అయితే ఆ కావ్య దాని అర్థం చేసుకోగల కవి, పండితుడు గాని నాకు ఇంతవరకు కనిపించలేదు. నీ             ఆస్తానంలో గల అష్టదిగ్గజ కవులలో దీని అర్థాన్ని చెప్పగలవారు ఉన్నారేమోనని వచ్చాను,”  అని ప్రకటించాడు కవి.

తన ఆస్థానంలోని కవులందరూ ఎందుకూ పనికిరాని వారని ఆ కవి రుజువు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు రాయల వారికి అర్థమైంది. అయితే తను ఆ విషయాన్ని బయటికి తెలియనీయకుండా కృష్ణదేవరాయలు అ కలిపి తన కావ్యం చదవమని చెప్పాడు. ఆ తరువాత తన ఆస్థానంలోని కవులు దాని అర్థాన్ని చెప్తారని కూడా రాయలు ప్రకటించాడు. రాయలు చెప్పినట్లుగా కవి తన కావ్యాన్ని చదవడం మొదలుపెట్టాడు.

రాజనందన రాజ రాజాత్మజుల సాటి
తలప నన్నయ్య వేమ ధరణి పతికి
రాజనందన రాజ రాజాత్మజుల సాటి
తలప నన్నయ్య వేమ ధరణి పతికి
భావ భవ భోగ సత్కళా భావములను
భావ భవ భోగ సత్కళా భావములను

పద్యాన్ని సావధానంగా విన్న కవులందరూ అల్లసాని పెద్దనతో సహా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. స్వతహాగా కవి అయిన కృష్ణదేవరాయలకు కూడా దాని అర్థం గురించి సందేహం తలెత్తింది. తన ఆస్థానంలోని కవులు దాని అర్థాన్ని చెప్పలేరేమో నని ఆందోళన పడ్డాడు. ఆ సందర్భంలో హఠాత్తుగా రామకృష్ణుడు లేచి, “కవివర్మ! నేను కూడా ఒక పద్యం రాశాను. ఇది ఇప్పుడు చదువుతాను.  మీరు దాన్ని విని అర్థం చెప్పండి. ఈ లోపు మేము మీ పద్యం గురించి దాని అర్థం గురించి ఆలోచిస్తాము. ముందున వినండి అని చదవడం మొదలు పెట్టాడు.

” మేక తోకకు మేక మేక తోక
మేక తుతోక మేక తోకా మేక మేక తోక
మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోకా మేక మేక తోక
మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోకా మేక మేక తోక
మేక తోకకు మేక తుతోక మేకకు తోక మేక తోకా మేక మేక తోక                                                                                                                               మేక తొక తోక మెక మేక తోక మేక
మేక తొక తోక మెక మేక తోక మేక
మేక తోక తోక మేక మేక తోక మేక
మేక తోక మేక తోక తొక మేక మేక”

  రామకృష్ణుని చదివిన పద్యానికి అర్థం చెప్పలేకపోయాడు కవి. తనకు ఒక రోజు సమయం ఇస్తే తరువాత రోజు అర్థం చెప్తానని అన్నాడు కావ్య అభ్యర్థనను మన్నించారు రాయల తో సహా అందరూ.

 

రెండవ రోజు రాయల అష్టదిగ్గజాలలో పాటు మిగతా అందరు సభ్యులు కొలువుదీరారు. రామకృష్ణుడు చదివిన పద్యానికి అర్థం ఏమిటోనని, కవి గారు ఏమి చెబుతారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అతిధి కవి మాత్రం ఎంత కి రాలేదు. రాయులు వారిని పిలుచుకురమ్మని అతిథిగృహానికి బట్టలను పంపాడు.

అక్కడకు వెళ్లిన బట్టలు కవిగారు అర్ధరాత్రి అతిథి గృహం ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు చెప్పారు. ఆ విషయం విన్నవాల్లందరూ రాయల తో సహా నవ్వకుండా ఉండలేరు పోయారు రామకృష్ణుడు చేసిన పని తమ పరువు మర్యాదలు కాపాడడానికి తో పాటు అష్టదిగ్గజ కవులు కూడా అందించారు అతనికి అనేక బహుమతులు అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here