మనందరి ప్రియమైన పేరుపొందిన సుప్రసిద్ధ దర్శకుడు కోడి రామకృష్ణ ఈరోజు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ లో చికిత్స పొందుతూ చనిపోయారు.

 

గత నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న కోడి రామకృష్ణ గారిని హాస్పటల్లో చేర్చారు. నిన్నటి నుంచి ఆరోగ్యం మరీ విక్రయించడంతో వెంటిలేటర్పై ఉంచారు అయినా ఎలాంటి ఫలితమూ లేదు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆయన చనిపోయారు డాక్టర్లు ప్రకటించారు ఈ వార్త విన్న తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయింది కోడి రామకృష్ణ గారు 1982లో చిరంజీవి గారి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు అంతకుముందు దాసరి నారాయణ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు.

 

సామాజిక, కుటుంబ కథాంశాలతో చిత్రాలను రూపొందించడమే కాకుండా అమ్మోరు, దేవి, దేవుళ్ళు, దేవి పుత్రుడు, అంజి, అరుంధతి వంటి సోషియో ఫాంటసీ చిత్రాల ద్వారా అఖండ విజయాలను సొంతం చేసుకున్నారు కోడి రామకృష్ణ.అత్యంత వేగవంతంగా సినిమాలను రూపొందించడం, నిర్మాత సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవడం, దర్శకుడిగా తన ఆత్మాభిమాన పతాకాన్ని ఎగుర వేస్తూ నే స్టార్స్ కు, స్టార్ డమ్ కు తగిన విలువ ఇస్తూ అటు టాప్ స్టార్స్ తోను, ఇటు నూతన నటీనటులతోను అద్భుత విజయాలను సాధించారు కోడి రామకృష్ణ.

 

తెలుగు చలనచిత్రరంగంలో ఒక ఎన్టీ రామారావు మినహా మిగిలిన టాప్ స్టార్స్ అందరినీ డైరెక్ట్ చేశారు కోడి రామకృష్ణ. దర్శకుడిగానే కాకుండా నటుడుగా కూడా కోడి రామకృష్ణ కొన్ని విశిష్ట పాత్రలు పోషించారు. దొంగాట, ఆస్తి మూరెడు ఆశ బారెడు, అత్తగారు స్వాగతం, ఇంటి దొంగ, మూడేళ్ళ ముచ్చట వంటి చిత్రాలలో కోడి రామకృష్ణ ప్రత్యేక తరహా పాత్రలు పోషించి మెప్పించారు. శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించడం ద్వారా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడిన నేపథ్యంలో కోడి రామకృష్ణ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక “రఘుపతి వెంకయ్య అవార్డు”ను ప్రకటించింది. కానీ ఆ అవార్డును స్వీకరించకుండానే కోడి రామకృష్ణ కన్నుమూయటం దురదృష్టకరం.

వివాద‌స్ప‌ద‌ము విలాస‌మ‌య‌ము అయిన సినిమా అనే ఈ రంగుల ప్ర‌పంచంలో ఎప్పుడూ ఎవ‌రితో ఏ వివాదంలోనూ కోడి రామ‌కృష్ణ పేరు వినిపించ‌లేదు. విజ‌యాల‌లో త‌ప్ప వివాదాల‌లో త‌న పేరు, ప్ర‌స్తావ‌న రాకుండా త‌న గౌర‌వాన్ని, వ్య‌క్తిత్వాన్ని కాపాడుకుంటూ `శ‌త‌చిత్ర సౌధం`గా ఎదిగిన కోడి రామ‌కృష్ణ‌ మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆ శతాధిక దర్శక శిఖరం ఆత్మశాంతిని ఆకాంక్షిస్తూంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here