కొద్ది కాలంలోనే రామకృష్ణకు కాళీమాత కృపవల్ల గొప్ప కవిగా గుర్తింపు వచ్చింది. అతడి కవి శక్తిని అందరూ కీర్తిస్తున్నారు.

రామకృష్ణుడు రచించిన “లింగపురాణం” పండితుల ప్రశంసలను అందుకుంది. రామకృష్ణుని కవితాశక్తికి ముగ్ధులైన అభిమానులు తన మహారాజు శ్రీకృష్ణదేవరాయలను కలుసుకోమని సలహా ఇచ్చారు. రాయల ఆస్థానంలో కవి కావాలని రామకృష్ణునికి కూడా అభిలాష ఉండేది. అప్పటికే రామకృష్ణకు మంగమ్మ అనే తన బంధువుల అమ్మాయితో పెళ్లి అయింది. రాయల ఆస్థానంలో చేరాలనే కోరికతో రామకృష్ణ తన స్వస్థలమైన గ్రామంలో ఇల్లు, పొలం అమ్ముకొని భవిష్యత్తు మీద నమ్మకంతో విజయనగరం బయలుదేరాడు.

రామకృష్ణ ఒకరోజు విజయనగరంలో ఒక చాటింపు విన్నాడు. ఆ చాటింపు వల్ల రాయల ఆస్థానానికి ఒక గొప్ప పండితుడు రాబోతున్నాడు అతడు తన కవిత్వాన్ని సభికులకు వినిపిస్తారని తెలుసుకున్నాడు. ఆ సభకు అనేక మంది కవులు, పండితులు ఆహ్వానించబడ్డారు కుతూహలం ఉన్న ప్రతివారు హాజరు కావచ్చు అని చాటింపు లో ప్రకటించారు. తాను ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నాయి అవకాశం ఇప్పుడు వచ్చిందని రామకృష్ణ ఆనందించాడు.

రెండవ రోజు ఉదయాన్నే రామకృష్ణ నిద్రలేచి కాలకృత్యాలు ముగించుకొని, రాయల ఆస్థానానికి వెళ్ళాడు. నేరుగా సభ లోకి వెళ్లి ఒక మూల ఆసిన్ అయ్యాడు. అప్పటికే సభ కవులు, పండితులు, కళాకారులు తో నిండి ఉంది. అంత మంది సమక్షంలో తన ఉండటం రామకృష్ణకు ఆనందంగా ఉంది. కొద్దిక్షణాల తర్వాత ఆ రోజు సభలో ప్రసంగించి ప్రసంగాన్ని ప్రారంభించా8రు.” ఈ ప్రపంచం మొత్తం అవాస్తవం. ఈ సృష్టిలో జరుగుతున్నట్లుగా కనిపించేది నిజానికి జరగడం లేదు. ఈ ప్రపంచంలో సుఖాల్ని మనం ఇంద్రియాలు  అనుభవిస్తున్న అనటం సరికాదు.  అదంతా ఊహ మాత్రమే. మనం వాసన చూస్తున్న, వింటున్న, మాట్లాడుతున్న అనే విషయాలు కూడా ఒట్టి భ్రమ మాత్రమే…..” అని  పండితులు చెప్పుకుంటూ పోతున్నాడు.

అప్పుడు రామకృష్ణ ఆ పండితుని ఆపి, “అయ్యా! తమరి అభిప్రాయం ప్రకారం ఆనందించడానికి, ఆనందిస్తున్నామని అనుకోవటానికి మధ్య ఎలాంటి వ్యత్యాసము లేదన్నమాట”  అని అడిగాడు. ” అవును. ఎలాంటి  వ్యత్యాసము లేదు,”  అన్నాడు పండితుడు.  అప్పుడు రామకృష్ణ సభికుల వైపు చూసి, “అయ్యలారా! పండితులుగారు చెప్పినమాటలు ఎంతవరకు సత్యమెా మనం ఇప్పుడు చాలా తేలిగ్గా పరీక్షించవచ్చు. మనమందరం ఈ రోజు శ్రీకృష్ణదేవరాయలు గారు ఏర్పాటు చేసిన విందు తృప్తిగా ఆరగించాం. అయితే మన పండితులు గారు ఇంతవరకు విందు ఆరగించినప్పటికీ అప్పగించినట్లుగానే భావించుకుంటారు. ఆయన చెప్పినట్టుగానే ఆరగించటానికిీ ఆరగించినట్టు భావించుకోవడానికి మధ్య వ్యత్యాసం ఎంతమాత్రం లేదు. అవునా పండు పండితులు గారు”, అని అడిగాడు రామకృష్ణ.

రామకృష్ణుని మాటలు విన్న సభలోని ప్రజలందరూ నవ్వ్ ఆపుకోలేకపోయారు. పండితుడు కూడా రామకృష్ణకు ఎటువంటి సమాధానం చెప్పలేక తలదించుకున్నాడు.

 

రామకృష్ణ ప్రదర్శించిన యుక్తికి శ్రీకృష్ణదేవరాయలు కూడా సంతోషించాడు. కొన్ని  బంగారు నాణ్యాలు రామకృష్ణుడికి బహుమతిగా ఇచ్చాడు రామకృష్ణ పుట్టుపూర్వోత్తరాలు విచారించి అతనిని తన ఆస్థాన కవిగా నియమించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here