అనగనగా ఒక ఊరిలో రామభద్రయ్య అనే ధవంతుడు ఉండేవాడు. అతడికి తరగనంత ఆస్థి ఉందే కానీ చదువు అబ్బలేదు. తన కొడుకు వినయ్ నీ బాగా చదివించాలని మంచిపేరున్న ఒక పాఠశాలలో చేర్పించాడు. వినయ్ పాఠశాలలో బుద్ధిగా చదువుకునేవాడు. కొంతకాలానికి గురువుగారు సుధీర్ అనే పేదింటి పిల్లవాడిని కూడా పాఠశాలలో చేర్పించుకున్నారు.

సుధీర్ ఇని అక్కడ చూసిన వినయ్ ఆశ్చర్యపోయాడు. కానీ కాసేపు ఆలోచించిన తరువాత ‘వీడితో చక్కగా నా పనులు చేయిచుకోవచ్చు’ అని సంతోషించాడు.ఎందుకంటే సుదీర్ తండ్రి వినయ్ తండ్రి దగ్గర గుమాస్తాగా పని చేస్తున్నాడు.అందువల్ల తను చేయవలసిన పనులన్నీ సుధీర్తో చేయించడం మొదలుపెట్టాడు వినయ్. అతడికి భయపడి చెప్పిన పనులన్నీ చేయసాగాడు సుధీర్. వాళ్ళిద్దరి వైఖరిని గురువుగారు గమనించారు

ఒకరోజు వారిద్దరినీ ప్రత్యేకంగా పిలిపించి వినయ్ నువ్వు నీ పనులను సుధీర్ తో చేస్తున్నావ్ అది సరైనది కాదు మీ తండ్రి సుధీర్
తండ్రి సేవ చేస్తున్నంత మాత్రాన వారి కుటుంబం మొత్తం మీకు సేవలు చేయాలనుకోవడం మంచిది కాదు మీరిద్దరూ ఇక్కడ నా విద్యార్థులు నాకు అందరూ సమానమే నేను ఎవరికి అప్పగించిన బాధ్యతలు వాళ్లు పూర్తి చేయాలి ఇది ఇంకోసారి జరిగితే నేను నిన్ను పాఠశాల నుంచి పంపి వేయాల్సి వస్తుంది అని వినయ్కి హెచ్చరించారు.అప్పటి నుంచి తన పనులు తాను చేసుకుంటూ సుధీర్ తో స్నేహం గా ఉన్నాడు

నీతి: ఉంది కదా అని గర్వంతో ఉండకూడదు వినయం మంచిదని తెలుసుకోవాలి

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here