రాజస్థాన్ లో ఒక సుభిక్షంగా ఉన్న గ్రామం ఉంది. గ్రామం పేరు రాయపూర్ ఇక్కడ మొత్తం కష్టపడి శ్రమించే వాళ్లే కేవలం ఒక్క సోమరి రైతు తప్ప ఆ రైతు పేరు కృష్ణ.కృష్ణ వాళ్ళ పూర్వీకుల స్థలం చాలా పెద్దది సాగుచేసుకోవడానికి తగినది కానీ అక్కడ ఏమి పండేది కాదు ఎందుకంటే కృష్ణ అక్కడ ఏమి పండించడం లేదు కానీ ప్రతి రోజు ఇంటి నుండి పొలానికి బయలుదేరి పడుకునేవాడు కృష్ణ వాళ్ళ ఇంటి పరిస్థితి రోజు రోజుకి దారుణంగా తయారయింది కృష్ణ భార్యకి ఇంటిని చూసుకోవడం కష్టం గా ఉంది ఎందుకంటే ఇంట్లో ఉన్న ధనము ధాన్యము అయిపోయే పరిస్థితి వచ్చేసింది.

ఒకరోజు కృష్ణ భార్య లీల ఒక నిర్ణయం తీసుకుంది ఇకపై తను కూడా తన భర్త తో పాటు పొలం కి వెళ్ళాలి అనుకుంది తరవాత రోజు పొద్దు పొద్దున్నే కృష్ణ పొలానికి వెళ్ళే సమయాని కి లీల తన దగ్గరికి వచ్చింది.మీతో పాటు ఇకపై పొలానికి నేను వస్తానని చెప్పింది.రామా కి అర్థమైపోయింది తన బండారం బయట పడిందని అప్పుడు ఇద్దరూ పొలం దగ్గరికి వెళ్ళారు అప్పుడు లీల పొలాన్ని చూసి ఆశ్చర్యపోయింది.

తనకి అసలు అర్థం కాలేదు కృష్ణ రోజంతా పొలం లో ఏం చేస్తాడు అని తను కృష్ణ వైపు చాలా కోపంగా చూసింది తరువాత అటు ఇటు పొలాల వైపు చూసింది అప్పుడు లీల మనసులో అనుకుంది ఇకపై కృష్ణ కి కష్టపడడం నేర్పించాలి అనుకుంది అలాగా కృష్ణ చేతికి ఒక నాగలిని ఇచ్చింది పొలం వైపు చూపించి సైగ చేసింది కృష్ణ నాగలితో తవ్వుతుంటే లీల విత్తనాలు వేస్తూ ఉండేది సాయంత్రం అయ్యే వరకు ఇద్దరు చాలా కష్టపడ్డారు.

తరవాత రోజు ఇదే విధంగా కొనసాగింది అప్పుడే ఒక మహా రుషి అటు వైపు వచ్చాడు మహా రుషి ని చూసిన వారికి తాగడానికి నీరు ఇచ్చింది లీల. కృష్ణ ఆ మహర్షికి తినడానికి రొట్టెలను ఇచ్చాడు ఆ దంపతులకు యొక్క సేవలకు మెచ్చి ఇలాగ అన్నారు “మీరిద్దరూ చేసిన సేవలకు నేను మెచ్చాను మీకు ఏం వరం కావాలో కోరుకోండి అన్నారు”. లీల కృష్ణ వైపు చూడడం మొదలుపెట్టింది అప్పుడు కృష్ణ కి ఒక ఆలోచన వచ్చింది మీరు నిజంగా మాకు ఏమైనా ఇవ్వాలనుకుంటే మాకు సహాయం చేయడానికి ఒక సహాయకుడిని ఇవ్వండి అతను మా పనులన్నీ చెయ్యాలి.

ఈ మాట విన్న లీల పెద్దగా సంతోష పడలేదు కానీ తన మౌనం గా ఉంది మహర్షి దానికి ఒప్పుకుంటూ మీ ఇద్దరి కోరిక ఇదే అయితే అది వెంటనే చేస్తాను అంటూ ఒక శరత్ పెట్టారు గుర్తు పెట్టుకోండి మీ దగ్గర చాలా పని ఉండి తీరాలి.ఈ సహాయకుడు ఎప్పుడూ ఏదో ఒక పని  చేస్తూనే ఉండాలి. దానికి కృష్ణ మా దగ్గర చాలా పని ఉందండి మీరు కనుక మాకు  సహాయకుడు నీ ఇచ్చేస్తే.మహర్షి ఇచ్చారు

తథాస్తు అని వరమిచ్చారు మహర్షి తన మండలం నుండి నీళ్ళు చల్లవలెను అక్కడ ఒక పెద్ద నాయకుడు రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు,నాకు పని చెప్పండి యజమాని గారు లేకపోతే నేను మిమ్మల్ని తినేస్తాను కృష్ణ ఇంక లీల భయపడిపోయారు కృష్ణ సేవకుడికి పని అప్పగించాడు మొత్తం విత్తనాలు జల్లు విత్తనాలు అక్కడ ఉన్న మూట లో ఉన్నాయి అని సేవకుడికి అప్పగించాడు మహర్షి అక్కడి నుంచి వెళ్లిపోయాడు మళ్లీ వెళ్ళిపోతూ మళ్లీ హెచ్చరించాడు

“ఆ సేవకుడికి ఎప్పుడు ఏదో ఒక పని ఇస్తూనే ఉండాలి”మహర్షి అక్కడి నుంచి వెళ్ళిన కొద్ది నిమిషాలు రాక్షసుడు సేవకుడు తిరిగి వచ్చాడు పొలంలో విత్తనాలు వేసేసాను అని చెప్పాడు నాకు పని చెప్పండి యజమాని గారు అని లేకపోతే నేను మిమ్మల్ని తినేస్తాను అని అన్నాడు కృష్ణ మళ్ళీ ఇంకొక పని చెప్పాడు అక్కడ బావి సగంలో తవ్వి ఆపేశారు దాన్ని నువ్వు పూర్తి చేయి సేవకుడు అనగా రాక్షసుడు అక్కడినుంచి మాయమైపోతాడు.

లీల కృష్ణ తో అంటుంది ఏంటండీ మీరు ఇలాంటి సమస్య తెచ్చి పెట్టారు ఈ సేవకుడు మాటిమాటికీ మిమ్మల్ని తినేస్తాను అంటున్నాడు.కృష్ణ ఇప్పుడు నాకు కూడా భయం మొదలైంది ఒకవేళ రాక్షసుడు నిజంగా నేను తినేస్తాడు ఏమో ఇతను పనులన్నీ చాలా త్వరగా చేసేస్తున్నాడు పైగా వచ్చి నేను తినేస్తా అంటున్నాడు. దీనికంటే కూడా నా అంతట నేనే కష్టపడితే ఉంటే బాగుండేది హఠాత్తుగా లీల ఒక ఉపాయం తట్టింది అందుకే తను సేవకుడు తిరిగి మళ్ళీ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసింది.

ఆ సేవకుడు ఏమైనా మాట్లాడక ముందే లీల ఇలా చెప్పింది “మా గ్రామం బయట ఒక కుక్కని కట్టేశారు నువ్వు వెళ్లి దాని తోక వంకర లేకుండా చెయ్యి అని చెప్పింది ఆ రాక్షసుడు అక్కడినుండి మాయమయిపోయాడు సాయంత్రం అయ్యింది ఆ రాక్షసుడు ఇంకా రాలేదు కృష్ణ లీలతో ఇలా అంటున్నాడు ఈపాటికి ఆ రాక్షసుడు కుక్క తోక ని సరిచేసి ఉంటాడు కదా లీల రామ మాటలు విని నవ్వడం మొదలు పెట్టింది పైగా ఇలాగ అంది. నా అమాయక పతి దేవా నేను ఆ రాక్షసుడికి ఎప్పటికీ పూర్తి కాని పని అప్పగించాను ఇక నువ్వు ఈ రోజు నీ మనసు పెట్టి పని చేయండి లేకపోతే రాక్షసుడు మిమ్మల్ని తినేస్తాడు.

 

                             “లీల సమయస్ఫూర్తికి తెలివి కి కృష్ణ ఆపద నుండి బయటపడ్డాడు కూడా కృష్ణ కి కూడా బాగా అర్థమైంది సోమరితనం ఎంత చెడు.”

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here